AP Inter Results 2020

ఏపీ ఎంసెట్ 2019 ఫలితాలు విడుదల !

ap eamcet 2019 results

ఏపీ ఎంసెట్ – 2019 ఫలితాలను జూన్ 4 (మంగళవారం ) వ తేదీ ఉదయం 11:30 కి ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ ఎంసెట్ ఫలితాలను మే 18 వ తేదీన విడుదల చేయాలని భావించినప్పటికీ , తెలంగాణ ఇంటర్ ఫలితాలలో వచ్చిన గందరగోళం కారణంగా ఏపీ ఎంసెట్ ఫలితాలలో ఆలస్యం జరిగింది. దాదాపు 36వేల మందికి పైగా తెలంగాణకు చెందిన విద్యార్థులు ఏపీ ఎంసెట్ పరీక్షను రాశారు. అయితే వారికీ ర్యాంకు లు కేటాయింపు విషయంలో ఇంటర్ మార్కులు అవసరం కానున్నాయి. ఇంటర్ మార్కులకి ఎంసెట్ లో 25% వెయిటేజీ కారణంగా, ఏపీ ఎంసెట్ 2019 ఫలితాలలో ఆలస్యం జరిగింది.

>> AP EAMCET Official Website: https://sche.ap.gov.in/

ఏపీ ఎంసెట్ 2019 పరీక్షను ఏప్రిల్ 20 నుండి 24 వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే… అయితే ఏపీ లో మొత్తం 2,82,901 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షను రాశారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,85,711 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వైద్య మరియు వ్యవసాయ విభాగంలో 81,916 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ కి వెళ్లి ,ఎంసెట్ Hall Ticket మరియు Mobile Number ను ఎంటర్ చేసి ఫలితాలను పొందవచ్చును.

ఏపీ ఎంసెట్ 2019 ఫలితాలు కోసం క్లిక్ చేయండి.

మరిన్ని Latest Tech, Mobile, Results, Job Updates, Blogging and More News కోసం Visit: www.Teluguguru.in
Facebook Official Page: www.Facebook.com/Teluguguru
ఈ సమాచారం కోసం మీకు నచ్చినట్లయితే Share మరియు Comment చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *